- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊర్లకు చేరేందుకు నానా తిప్పలు.. కేటీఆర్ సాయం
దిశ, హైదరాబాద్: గ్రామాల్లో సరైన పనులు లేనందున నిత్యం వేలు.. లక్షల మంది బతుకు దెరువుకు పట్నాలకు చేరతారు. ఈ సంఖ్య అన్ని నగరాల కంటే హైదరాబాద్ లాంటి మహానగరాలలో మరీ ఎక్కువ. కుటుంబ సభ్యులందరికీ ఏదో ఒక పని దొరుకుతుందనే భరోసా కల్పిస్తోంది హైదరాబాద్ మహానగరం. అందుకే రోజురోజుకి భారంగా మారుతున్న వ్యవసాయాన్ని వదిలేస్తున్న అనేక మంది పల్లె వాసులు పట్నాలకు వలస వస్తుంటారు. పురుషులైతే వాచ్ మెన్ గానో.. స్త్రీలైతే ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తుంటారు. కరోనా వైరస్ కారణంగా యావత్తు ప్రపంచమే గడగడలాడిపోతుంది. ముఖ్యంగా ఈ ప్రభావం పల్లెల కంటే పట్టణాలలోనే అత్యధికంగా ఉంది. దీంతో కరోనాతో పట్టణాల కంటే పల్లెలే సేఫ్ అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ ప్రకటించగానే కరోనా తీవ్రతను, ప్రభావాన్ని పసిగట్టిన అనేక మంది వారి సొంతర్లకు పయనమయ్యారు. జనతా కర్ఫ్యూ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని లాక్ డౌన్ ప్రకటించడం, ఆ తర్వాత ప్రధాని మోడీ యావత్తు దేశాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రత్యేక ప్రసంగంలో తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఇదే పద్దతిలో లాక్ డౌన్ మొదటి రోజు సోమవారం సక్సెస్ కాకపోవడంతో సీఎం కేసీఆర్ ప్రజలు, ప్రజాప్రతినిధులపై చాలా సీరియస్ అయ్యారు. ఆపత్కాలంలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను గుర్తు చేశారు. అయినా.. పల్లెలకు చేరాల్సిన పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇంకా నగరంలోనే ఉండిపోవడంతో, ఎలాగైన తమ ఊర్లకు చేరాలని వీరంతా భావిస్తున్నారు. పోలీసులు అనుమతించకపోవడంతో నగరం దాటేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది తమ ప్రయత్నాలు విఫలం కావడంతో వెనుతిరుగుతున్నారు. మరికొందరు ఎలాగైనా వెళ్ళాలనుకుంటున్న వారు వెళ్తున్నారు. అయితే, అలాగే ముందుకెళ్ళిన వారు పోలీసు తనిఖీల మధ్య ఆగిపోతూ నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రయాణంలో పిల్లలు కూడా ఉంటున్నందున వైరస్ వ్యాప్తిపై ఆంధోళన తప్పడం లేదు. కాగా, ట్యాంక్ బండ్ సమీపంలోని బుద్ధభవన్ వద్ద నల్గొండ జిల్లా తుంగతుర్తి వెళ్లేందుకు సిద్దపడ్డ ఓ కటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్ మాట్లాడి వారి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు.
Tag: Lockdown,Tour, ktr, special vehicle, humanity, Corona, Hyderabad