భువనేశ్వర్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..

by srinivas |
cm jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ఒడిశా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భువనేశ్వర్‌ చేరుకున్నారు. భువనేశ్వర్ చేరుకున్న సీఎం జగన్‌ను ఒడిశా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే మరికాసేపట్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం, కొఠియా గ్రామాలపై సీఎం వైఎస్ జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు.

Advertisement

Next Story