- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లమల అడవుల్లో అరుదైన 'అడవి రైతు' పక్షి
దిశ, వెబ్‌డెస్క్: ఈ భూమి మీద మనతో పాటు పక్షులు, కీటకాలు, జంతువులు చాలా జీవిస్తున్నాయి. కానీ ఇవి మన కంటికి కనిపించవు. ఎక్కడో అడవుల్లో, సముద్రాల్లో జీవిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అరుదైన పక్షులు, కీటకాలు, జంతువులు దర్శనమిచ్చి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అప్పటివరకు ఇవి ఉన్నాయని కూడా మనకి తెలియవు. మనం జూపార్కుల్లో చూసేవి కొన్నే. కానీ మనకి తెలియనవి, చూడనవి చాలా ఉన్నాయి.
తాజాగా అరుదైన అడవి రైతు పక్షి నల్లమల అడవుల్లో దర్శనమిచ్చింది. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని అడవుల్లో అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి కనువిందు చేసింది. అటవీశాఖ కెమెరాలకు ఇది చిక్కగా.. దీనిని అడవి రైతు, ఫారెస్ట్ ఇంజనీర్స్ అని పిలుస్తారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
భారత ఉపఖండంలో మాత్రమే ఇవి కనిపిస్తాయట. వీటికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కు, పొడవైన తోక ఉంటాయి. పాములు, బల్లులను ఆహారంగా తీసుకుంటాయి. ఎత్తైన చెట్లపైన, కొండలు, గుట్టలపైన ఇవి సంచరిస్తాయి. నలుపు, తెలుపు, బూడిద రంగుతో ఇవి ఉంటాయి.