పుట్టిన వెంటనే జననంగాన్ని మార్చిన వైద్యులు.. పెద్దయ్యాక జెండర్ మార్చాలని కేసు

by Anukaran |   ( Updated:2021-06-17 23:25:27.0  )
Fundraiser by Luna Animisha
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, హవాయి స్టేట్‌ పూనా లోని ఓ ఆసుపత్రి.. పురిటినొప్పులతో ఉన్న ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. కానీ, బిడ్డ పుట్టిందని అందరు సంతోషించేలోపు.. ఆ బిడ్డ అమ్మాయా? అబ్బాయా? అనేది తేల్చలేని పరిస్థితి. ఎందుకంటే.. మగ ఆడ రెండు జననాంగాలతో బిడ్డ పుట్టడం అటు తల్లిదండ్రులతో పాటు ఇటు వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక చేసేదేమి లేక వైద్యులు సర్జరీ చేసి బిడ్డ స్త్రీ జననాంగంను కుట్టేసి మగాడిగా మార్చేశారు. అంతేకాకుండా ఆమె గర్భసంచిని కూడా తొలగించేశారు. ఇక అలా చూస్తూ చూస్తూ ఆ అమ్మాయి అబ్బాయిలా పెరిగింది. ఇదంతా 24 ఏళ్ల క్రితం మాట. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి తనను ఇంత క్రూరంగా మార్చిన వైద్యులపై కేసు వేశాడు. తనకు మళ్లీ సర్జరీ చేసి ఆడపిల్లగా మార్చాలని డిమాండ్ చేశాడు. ఈ వింత కేసు సుమారు పాతికేళ్ల తర్వాత వివాదాస్పదంగా మారింది. ప్యాస్తుతం ఈ కేసు నెట్టింట వైరల్ గా మారింది. ఈ కేసు కి సంబంధించి పూర్తీ వివరాలలోకి వెళితే..

హవాయి స్టేట్‌ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్‌పర్ట్‌ లూనా అనిమిషా ఆడ-మగ జననాంగాలతో(ఇంటర్‌సెక్స్‌ జెండర్‌) గా పుట్టింది. ఇక వైద్యులు తనను మగవాడిగా మార్చేయడంతో 24 ఏళ్లు మగవాడిగానే పెరుగుతూ వచ్చింది. కానీ లూనా వయసు పెరుగుతున్న కొద్దీ.. అతనిలోపల ఆమె లక్షణాలు కూడా పెరుగుతూ వచ్చాయి. గౌన్లు వేసుకోవాలని, ఆడవాళ్ల వస్తువులతో ఆడుకోవాలని, అమ్మాయిలు చేసే పనులన్నీ చేయడం మొదలు పెట్టింది. దేహం అబ్బాయిగా ఉండడం.. మానసికంగా అమ్మాయి లక్షణాలు కనిపిస్తుండడంతో తీవ్ర మనో వేదనకు గురై ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని లూనా తెలిపింది. కానీ ఆలా చేయలేనని, తనను ఒక జంతువులాభావించి కర్కశంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుపడడానికి సిద్ధంగా ఉన్నానని, ఇప్పుడు తనకు పోరాడే వయసు, శక్తి రెండూ వచ్చాయని చెప్పుకొచ్చింది.

intersex gender

”తప్పు నా తల్లిదండ్రులదా? డాక్టర్లదా? అనేది నాకు అనవసరం లేదు . కానీ.. వారు చేసిన పని వల్ల ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను. నాకు మగాడిగా ఉండడం ఇష్టం లేదు. అమ్మాయిగానే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా బాధను అర్ధం చేసుకొని నాకు మళ్లీ సర్జరీ చేసి అమ్మాయిగా మార్చండి అంటూ తెలిపింది. ఈ సర్జరీ కోసం అయ్యే ఖర్చు కోసం ‘గో ఫండ్‌ మీ’ అనే సంస్థ ద్వారా విరాళాలను సేకరిస్తోంది. ఈ చికిత్స తర్వాత.. సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ఇంటర్ సెక్స్ ట్రాన్స్ జెండర్ బాధితుల కోసం తానూ పోరాటం చేస్తానని చెప్తోంది.

Advertisement

Next Story

Most Viewed