ఐపీఎల్‌కు చెక్ పెడుతున్న ‘కార్తీక దీపం’

by Shyam |
ఐపీఎల్‌కు చెక్ పెడుతున్న ‘కార్తీక దీపం’
X

దిశ, వెబ్‌డెస్క్: కార్తీక దీపం సీరియల్..వంటలక్క, డాక్టర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. రాత్రి ఏడున్నర గంటలు అయిందంటే..ఇంట్లో ఆడవాళ్లంతా టీవీ ముందుకు వచ్చేస్తారు. హా…ఈరోజు ఏం జరుగబోతోంది? కనీసం ఈసారైనా వంటలక్కను డాక్టర్ బాబు అర్థం చేసుకుంటాడా? శౌర్యను కూతురిగా యాక్సెప్ట్ చేసేస్తాడా? లేదా మౌనిత వీరిని విడగొట్టేందుకు మరో ప్లాన్ వేస్తుందా?. సౌందర్య ఆ ప్లాన్‌ను తిప్పికొడుతుందా? ఇలా రోజూ సీరియల్‌ గురించి ఇదే చర్చ జరిగినా సరే.. ఆ సీరియల్‌కు ఉండే ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గదు.

స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్ టైమింగ్స్..సీరియల్‌లో యాక్టర్స్ యాక్టింగ్ టైమింగ్స్ మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఎంతలా అంటే రోజంతా టీవీలో ఏదైనా చూడండి. కానీ, రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రం రిమోట్ మా చేతిలో ఉండాలి. టీవీలో కార్తీక దీపం సీరియల్ చూడాలి అని మగవాళ్లను డిమాండ్ చేసేంతలా. మరి ఇంట్లో బాస్ మహిళలే కాబట్టి వారిదే చెల్లుతుందిగా..అందుకే ఏమీ చేయలేక రిమోట్ కాస్త వారి చేతిలో పెట్టేస్తారు భర్తలు. ఇక్కడ ఇప్పుడు ఓ ప్రాబ్లం వచ్చింది పాపం. క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టపడే మగవాళ్లకు ఐపీఎల్ టైమింగ్స్ కూడా అదే కార్తీక దీపం టైమ్..రాత్రి ఏడున్నరకు పెట్టడంతో ఏమీ చేయలేక డైరెక్ట్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూళికి రిక్వెస్ట్ పెడుతున్నారు. ఐపీఎల్ టైమింగ్స్ చేయాలని కోరుతున్నారు. ఐపీఎల్ ఏడున్నరకు కాకుండా మరో సమయంలో పెట్టాలని కోరుతున్నారు. మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. ఆ సమయంలో మా ఫ్యామిలీ కార్తీక దీపం సీరియల్ చూస్తుంది. కాబట్టి ఇంట్లో ఎలాంటి విభేదాలు రాకుండా ఉండాలి అంటే ఐపీఎల్ టైమింగ్స్ చేంజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed