- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటు ప్యూన్ పని.. ఇటు టీచర్ పని
ప్రభుత్వోద్యోగం అంటే అందరికీ ఇష్టమే. తమ చదువుకు తగని పని అని తెలిసినప్పటికీ ఏదో ఒకటి అని అనుకుంటూ దరఖాస్తు చేసుకుంటారు. జాబ్ కొడతారు. అలాగే హర్యానాలోని అంబాలాలో మాజ్రి గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పనిచేసే కమల్ సింగ్ కూడా గ్రూప్ డి ఉద్యోగం సాధించి, ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. కానీ అతని క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఫిజిక్స్.
ఆ పాఠశాలలో మొత్తం 400 మంది విద్యార్థినీవిద్యార్థులు ఉన్నారు. కానీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు మాత్రం కేవలం 19 మంది మాత్రమే. వారిలో క్వాలిఫైడ్ మ్యాథ్స్ టీచర్ ఒక్కరే. దీంతో వారంలో 54 పీరియడ్లు తీసుకోవాల్సివస్తోంది. వాటికి తోడు ఎన్నికల డ్యూటీ, ఇతర స్కూల్ పనులు అదనం.
దీంతో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివిన కమల్ ఆ గణిత ఉపాధ్యాయునికి సాయం చేయాలనుకున్నాడు. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి కొన్ని క్లాసులు తాను తీసుకుంటానని చెప్పి, పాఠాలు మొదలుపెట్టేశాడు. కమల్ చాలా బాగా పాఠాలు చెబుతున్నాడని పిల్లలు అనడంతో, అందుకే వారానికి 17 పీరియడ్లు తీసుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా ఉప విద్యాధికారి సుధీర్ కల్రా అన్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం 9, 10 తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పడానికి సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. కానీ కమల్‌కి గణితంలో పీజీ లేనప్పటికీ ఉపాధ్యాయుల కొరత కారణంగా ఈ అవకాశం ఇచ్చారు. ఒక పక్క గంట మోగిస్తూ, స్టాఫ్‌కి అవసరాల్లో ఉపయోగపడుతూ మరో పక్క పాఠాలు చెప్తున్న కమల్ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుని తీరాలని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ విషయం గురించి హర్యానా విద్యాశాఖ మంత్రి కన్వర్ పాల్ గుజ్జర్ వద్ద ప్రస్తావించగా… బాగా చదువుకున్న వాళ్లని గ్రూప్ డీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొద్దని అడ్డుకోలేం కదా… వాళ్లు ఎంపికై గ్రూప్ డీ ఉద్యోగంలో చేరినప్పటికీ తర్వాత వెంటనే వేరే ఉద్యోగాలు సంపాదిస్తున్నారని కామెంట్ చేశారు. ఏదేమైనా చాలా రాష్ట్రాల్లో చదువు తగిన ఉద్యోగాలు దొరక్క కష్టపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారిని కూడా పట్టించుకుని నోటిఫికేషన్లు విడుదల చేస్తే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.