ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతురు ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2020-12-20 22:36:56.0  )
ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతురు ఆత్మహత్య
X

దిశ, కాటారం: ఆర్థిక ఇబ్బందులతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహదేవ్‌పూర్ మండలం కన్నేపల్లిలో కుటుంబ కలహాలతో మనస్ధాపం చెందిన సమత, ఆమె కూతురు అశ్విని సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కొంతకాలం క్రితం సమత భర్త మరణించారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Next Story