- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెల్లారేసరికి "తారురోడ్డు"
దిశ, భద్రాచలం : చర్లలో అద్భుతం జరిగింది. నిన్న మామూలుగా ఉన్న రోడ్డు తెల్లారేసరికి బిటీ (తారు) రోడ్డుగా మారింది. ఇది ఒకింత సంతోషకరమైనా అర్థరాత్రి హడావుడిగా వేసిన రోడ్డు ఎంతకాలం మన్నిక వస్తుందనేది ప్రశ్నార్థకం. మండల కేంద్రమైన చర్లలో ఆయిల్ బంక్ సెంటర్ నుంచి దోశిల్లపల్లి శివారు వరకు సుమారు 4 కి.మీ దూరం బిటి రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ 1.28 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం పగటిపూట వేయాల్సిన తారురోడ్డుని అధికారుల పర్యవేక్షణలేకుండా అర్థరాత్రి హడావుడిగా పూర్తిచేసే ప్రయత్నం చేశారు.
ఇలా రాత్రిపూట, అది కూడా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు దగ్గర లేకుండా బీటీ రోడ్డు నిర్మాణం చేయడం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు గ్రామస్థులు అడ్డుపడటంతో ఇంకా కొద్దిదూరం మాత్రమే మిగిలి ఉన్న రోడ్డు పనులను సంబంధిత కాంట్రాక్టర్ తరపు సిబ్బంది గత్యంతరంలేక ఆపినట్లుగా తెలుస్తోంది. బీటీ రోడ్డు నిర్మాణంపై క్వాలిటీ కంట్రోల్ ద్వారా దర్యాప్తు జరపాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.