- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు రూపాయలకే కడుపునిండా భోజనం.. ఎక్కడో తెలుసా..!
దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో సైన్య సేన ఆధ్వర్యంలో రూ. రెండు రూపాయలకు భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్య సేన అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేష్ మాట్లాడుతూ.. ఆర్డీఓ, తహలీల్దార్ కార్యాలయాలతో పాటు కోర్టుకు వచ్చే ప్రజలకు తినడానికి అనేక ఇబ్బందులు అవుతున్నాయని భావించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కార్యాలయాలకు వచ్చే నిరుపేదలకు పనులు ఆలస్యం జరుగుతుండటం, అలాగే కార్యాలయాల చుట్టుపక్కల ఎలాంటి హోటల్స్ లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తమకు మరికొంత మంది దాతలు ఎవరైనా ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకి తీసుకుని వెళతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైన్య సేన సభ్యులు శ్రీకాంత్, సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.