మత్తు దొరకక మృత్యుఒడిలోకి

by Sumithra |   ( Updated:2022-08-22 10:20:22.0  )
మత్తు దొరకక మృత్యుఒడిలోకి
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని వాణిజ్య వ్యాపారాలు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మద్యం, కల్లును కూడా బంద్ చేసింది. దీంతో మద్యం ప్రియులు మత్తు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ మద్యానికి అలవాటు పడిన శరీరం ఒక్కసారిగా మత్తు దొరకక పోవడంతో వింత వింత చేష్టలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని బచ్చుగూడెంలో కల్లుకు బానిసైన వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన మల్లేశం(39) అనే వ్యక్తి కల్లుకు తీవ్రంగా బానిసయ్యాడు. రోజూ కల్లు తాగే అతడు లాక్‌డౌన్ నేపథ్యంలో కల్లు దొరక్కపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే మూడుసార్లు మూర్చ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి తీసుకెళ్లగా మళ్లీ మూర్చ వచ్చి మృతి చెందాడు.

Tags: man, committed, strange acts, finding, alcohol, killed, medak, sangareddy

Advertisement

Next Story