విశాఖలో దగ్ధమైన తెలంగాణ వాసి 

by Anukaran |   ( Updated:2020-09-20 23:02:43.0  )
విశాఖలో దగ్ధమైన తెలంగాణ వాసి 
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద సోమవారం ఉదయం నడిరోడ్డుపై ఓ వ్యక్తి మంటల్లో కాలుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుని వివరాలు గుర్తించారు.

మృతుడు నల్గొండ జిల్లా చిట్యాడ మండలం వెలమనేడు గ్రామానికి చెందిన లారి డ్రైవర్ నరసింగరెడ్డిగా పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది. కాగా ఘటనకు సంబంధించి పలుకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story