నడిరోడ్డుపై కాలుతూ కనిపించిన వ్యక్తి 

by srinivas |
నడిరోడ్డుపై కాలుతూ కనిపించిన వ్యక్తి 
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద సోమవారం ఉదయం కనిపించిన ఓ భయానక దృశ్యం స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. గుర్తుతెలియని వ్యక్తి నడిరోడ్డుపై మంటల్లో కాలుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

ఐతే ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్టు గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం అందుతోంది.

Advertisement

Next Story