బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్న భర్త.. భార్య వెళ్లి చూడగా..!

by Sumithra |
బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్న భర్త.. భార్య వెళ్లి చూడగా..!
X

దిశ, మియాపూర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్ఐ లింగ్యనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని బీకే‌ ఎన్‌క్లెవ్‌‌లో వంశీ (37 ) భార్య శిరీష, కుమారుడు(2) తో నివాసం ఉంటున్నాడు. అతను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య, కుమారుడు ఇంట్లో ఉన్న సమయంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బెడ్ రూంలోకి వెళ్ళి గడియ వేసుకున్నాడు. ఎంతకి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య కిటికీలోంచి చూడగా తాడుతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో ఇరుగు పొరుగు సాయంతో తలుపులు బద్దలు కొట్టి కిందికి దించగ అప్పటికే చనిపోయి ఉన్నాడు. కాగా వంశీ గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో బాధడుతున్నట్లు సమాచారం. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక సమస్యలేనా ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని తరలించారు.

Advertisement

Next Story