మాస్క్ పెట్టుకో అన్నందుకు మహిళపై దాడి

by Anukaran |   ( Updated:2020-06-30 03:54:10.0  )
మాస్క్ పెట్టుకో అన్నందుకు మహిళపై దాడి
X

దిశ, అమరావతి బ్యూరో: కరోనా వ్యాపిస్తున్న నేపధ్యంలో మాస్క్ పెట్టుకోమని జాగ్రత చెప్పిన మహిళా ఉద్యోగిపై సహ ఉద్యోగి పైశాచిక దాడికి దిగాడు. ఈ ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా టూరిజం హోటల్ డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న భాస్కర్ రావు ఉషారాణి అనే సహ ఉద్యోగిపై దాడికి దిగాడు. మాస్క్ పెట్టుకోండి అని చెప్పినందుకు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన వారిని కూడా లెక్క చేయకుండా విచక్షణా రహితంగా చేతికి దొరికిన వస్తువులతో దాడి చేశాడు. అయితే ఆమె కాంట్రాక్టు ఉద్యోగి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సీసీ టీవీలో బయటపడిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story