- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈవీల వినియోగం పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈవీలపై కీలక వాఖ్యలు చేశారు. హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘ఈవీ ట్రేడ్ ఎక్స్ పో’ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాల కొనుగోళ్లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఈవీలు పెరిగితే కొంతమేర కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొ్న్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కొనుగోలుదారులకు పన్ను రాయితీలు, తయారీదారులకు ప్రోత్సాహకాలు అందజేస్తోందని గుర్తుచేశారు. అంతేగాకుండా, ఈవీ వినియోగదారులను వెంటాడుతున్న ఛార్జింగ్ పాయింట్ల సమస్యను తొలగించేందుకు రాష్ట్రంలో ప్రతీ 25 కిలో మీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. అనంతరం ఈవీ స్కూటర్లను మంత్రి స్వయంగా నడిపి పరిశీలించారు.