- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
దిశ, భువనగిరి: భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన వలిగొండ మండలం సంగెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన పద్మా, మహేశ్ దంపతులకు స్మైలీ(11) అనే కూతురు ఉంది. వీరు జీవనోపాధి కోసం కొన్నేండ్ల క్రితం బీబీనగర్‌కు వలస వెళ్లారు. దీపావళి పండుగ సందర్భంగా ఇటీవల స్వగ్రామం వచ్చారు. ఈ క్రమంలో స్మైలీ తన స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని మూసీ నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో భీమలింగం ప్రాజెక్టు వద్ద స్నేహితులంతా కలసి సెల్ఫీ దిగుతుండగా స్మైలీ కాలుజారీ నదిలో పడిపోయింది.
మూసీనది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చిన్నారి కొట్టుకుపోయింది. దీంతో ఆందోళన చెందిన స్మైలీ స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు గాలించగా స్మైలీ మృతదేహం లభ్యం అయింది. చిన్నారి మరణించడంతో తల్లితండ్రులు రోదన, గ్రామస్తులందరికీ కంటనీరు తెప్పించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించారు.