పోలీస్ దాతృత్వానికి సలాం.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..

by Anukaran |   ( Updated:2021-11-27 00:19:30.0  )
పోలీస్ దాతృత్వానికి సలాం.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసులంటే కఠినంగా కనిపించేవాళ్లే కాదు మానవత్వం ఉన్న వాళ్లూ ఉంటారని నిరూపించాడు మారుతీ ప్రసాద్. ఈయన అనంతపురం జిల్లా, గుత్తి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. మారుతీ ప్రసాద్ చేసిన పనికి ఇప్పుడు అందరితో శబాష్ అనిపించుకుంటున్నాడు. ఏకంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈయన చూపిన దాతృత్వానికి ఫిదా అయిపోయాడు.

ఉదయాన్నే డ్యూటీకి వెళుతున్న మారుతీ ప్రసాద్ కు రోడ్డు మీద చలికి వణుకుతూ ఓ అభాగ్యురాలు కనిపించింది. చలించిపోయిన కానిస్టేబుల్ తన జాకెట్ ని విప్పి ఆమెకు తొడిగాడు. తర్వాత ఆమెను అనంతపురంలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు వావ్ వాట్ లే కానిస్టేబుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Next Story