ఎల్లలు దాటిన అభిమానం.. ‘మాస్టర్’ కోసం మలేషియా నుంచి చెన్నైకి

by Shyam |
ఎల్లలు దాటిన అభిమానం.. ‘మాస్టర్’ కోసం మలేషియా నుంచి చెన్నైకి
X

దిశ, సినిమా: అభిమానం హద్దులు దాటింది అంటే ఏమో అనుకుంటాం కానీ, ఈ లేడీ ఫ్యాన్‌ను చూస్తే ఈ సామెతకు హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ ఇచ్చిందని అనిపిస్తుంది. నిజంగానే ఈ మహిళా అభిమాని ఏకంగా ఎల్లలు దాటేసి మలేషియా నుంచి ఇండియాకు వచ్చేసింది. ఎందుకోసమో తెలుసా? ఇళయ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్‌’ను థియేటర్‌లో చూసేందుకు! విషయం ఏంటంటే..

తమిళనాడుకు చెందిన ఆష్లినాకు చైల్డ్ హుడ్ నుంచే విజయ్ అంటే పిచ్చి అభిమానం. తన సినిమా రిలీజైతే ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూడాల్సిందే. పెళ్లి తర్వాత కుటుంబంతో సహా మలేషియాలో సెటిల్ అయిపోగా.. అక్కడ కూడా విజయ్ సినిమాలు రిలీజ్ అవుతాయి కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేసేది. కానీ కరోనా టైమ్స్ కారణంగా ‘మాస్టర్’ మలేషియాలో రిలీజ్ కాలేదు. దీంతో కాస్త నిరుత్సాహపడిన ఆష్లినా.. ఫైనల్‌గా ఒకటి డిసైడ్ అయింది. ఎలాగైనా ‘మాస్టర్’ సినిమాను చూడాల్సిందే అనుకుని వెంటనే ఫ్లైట్ ఎక్కేసి, చెన్నైలో వాలిపోయింది. సత్యం సినీ కాంప్లెక్స్‌లోని ఓ థియేటర్‌లో ‘మాస్టర్’ సినిమా ఆడుతుండగా.. ఏకంగా ఒక షోకు సంబంధించిన అన్ని టికెట్లు బుక్ చేసేసింది. చెన్నైలో ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసింది.

నిజానికి ‘మాస్టర్’ మూవీ జనవరి 29న అమెజాన్ ప్రైమ్‌లో కూడా రిలీజైంది. కానీ అభిమాన హీరో సినిమాను ఇంట్లో కూర్చుని చూస్తే మజా ఏముంటుంది? అందుకే దేశాలే దాటొచ్చింది. పాతతరం హీరోలను అభిమానులు విపరీతంగా ఆరాధించేవారంటే ఏమో అనుకునేవాళ్లం గానీ, ఇలాంటి సంఘటనలు చూశాక నిజమే అనిపించక తప్పదు.

Advertisement

Next Story