మహారాష్ట్రలో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా బిచ్చమెత్తిన శివాజీ వంశస్థుడు..

by Shamantha N |
మహారాష్ట్రలో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా బిచ్చమెత్తిన శివాజీ వంశస్థుడు..
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే లాక్‌డౌన్ విధించాలని చూస్తున్నారు. అయితే, రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించవద్దంటూ పలువురు సీఎంను కోరుతున్నారు.

తాజాగా ఛత్రపతి శివాజీ వంశస్థులు, బీజేపీ ఎంపీ ఉదయన్ భోస్లే మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించవద్దని కోరుతూ ఓ చెట్టు కింద కూర్చుని.. చేతిలో పళ్లెం పట్టుకుని బిచ్చమెత్తారు. తాను లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భోస్లే మాట్లాడుతూ.. మరోసారి లాక్‌డౌన్ విధిస్తే వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, పేదలు తిండి లేక అలమటించాల్సిన పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించాలనుకుంటున్న ఆలోచనపై సీఎం మరోసారి పునరాలోచించాలని కోరారు. ఈ సందర్భంగా తాను బిచ్చమెత్తగా వచ్చిన 450 రూపాయలను జిల్లా అధికారులకు అందజేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story