- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దొంగ ఆప్షన్.. అతడు కొట్టేసిన డబ్బులకు ఆమెతో ఈఎంఐ
దిశ, వెబ్‌డెస్క్ : దొంగతనాలు కూడా కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అందివచ్చిన టెక్నాలజీని వినియోగించుకుంటూ రోజుకో కొత్తమోసాలు తెర లేపుతున్నారు. ఓ సైబర్ నేరగాడు క్రెడిట్ కార్డులోని డబ్బులను కాజేయడంతోపాటు వాటిని చెల్లించేందుకు ఈఎంఐ ఆప్షన్ ఇచ్చి ఔరా అనిపించాడు. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ సైబర్ నేరానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో విశాఖపట్నాకి చెందిన పడవల ప్రవల్లిక ఉంటోంది. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ఆమె.. క్రెడిట్ కార్డును వాడుతోంది. అయితే ఆమెకు జూన్ 28న ఓ కాల్ వచ్చింది. ఆమె క్రెడిట్ కార్డుకు రివార్డ్ పాయింట్లు వచ్చాయని, వాటిని క్లయిమ్ చేసుకోవాలని స్లైస్ క్రెడిట్ కార్డు కార్యాలయం నుంచి కిషన్‌సింగ్ పేరుతో ఓ వ్యక్తి మాట్లాడాడు. నిజమేనని నమ్మిన ప్రవల్లిక ఓకే చెప్పేసింది.
పాయింట్లు క్లయిమ్ చేస్తున్నానని, ఓటీపీలు చెప్పాలని సదరు వ్యక్తి కోరాడు. అయినా అనుమానించని ప్రవల్లిక తన మొబైల్‌కు వచ్చిన రెండు ఓటీపీలను అజ్ఞాత వ్యక్తికి చెప్పింది. దీంతో ఆమె క్రెడిట్ కార్డు నుంచి రూ.60 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయనని ఆమె గ్రహించి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే సైబర్ నేరగాడు డ్రా చేసిన రూ.60 వేలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే విధంగా ఆప్షన్ ఎంపిక చేయడం గమనార్హం.