Crime News : బ్యూటీషియన్‌ను మాయ చేసిన ఘనుడు.. అందరూ కలిసి..

by Sumithra |   ( Updated:2021-05-27 22:19:36.0  )
cyber criminal who cheated on a beautician
X

దిశ, వెబ్‌డెస్క్ : మోసగాళ్లు రోజుకో ఎత్తుగడతో నయవంచనకు పాల్పడుతున్నారు. మాటలతో మాయ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తూ కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును కొల్లగొడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా బాలానగర్‌కు చెందిన ఓ మహిళకు లక్షల్లో కుచ్చుటోపి పెట్టాడో ఘరానా మోసగాడు. బాలానగర్ సీఐ వహీదుద్దీన్ మహిళ మోసపోయిన తీరును వివరించారు.

సౌభాగ్యలక్ష్మి అనే బ్యూటీషియన్ బాలానగర్ లోని రాజు కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె స్నేహితురాలు ఒకరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించే యాప్‌ గురించి వివరించింది. ఆమె మాటలు నమ్మిన సౌభాగ్యలక్ష్మి .. లైటింగ్‌ పవర్‌ బ్యాంక్‌ యాప్‌‌లో ఏప్రిల్‌ నెలలో కొంత డబ్బు పెట్టుబడి పెట్టింది. దానికి ఆ యాప్ నుంచి ఒకరు కాల్ చేసి మీ డబ్బులకు అధిక వడ్డీ కలిపి ఎక్కువ మొత్తంలో చెల్లిస్తామని తెలిపాడు. మీ పరిచయస్తులను కూడా చేర్పించాలని కోరాడు. అతడు చెప్పినట్లుగానే కొద్దిరోజుల్లోనే సౌభాగ్యలక్ష్మికి అధిక మొత్తం డబ్బు తన ఖాతాలో జమ అయింది.

పెట్టుబడికి కలిసి డబ్బులు రావడంతో సౌభాగ్యలక్ష్మికి లైటింగ్‌ పవర్‌ బ్యాంక్‌ యాప్‌‌పై నమ్మకం కలిగింది. దీంతో తన దగ్గర ఉన్న డబ్బుతోపాటు బంధువులు, స్నేహితులతో కలిపి.. రూ.12,91,025లను పెట్టుబడిగా పెట్టింది. అయితే సదరు వ్యక్తి ఇచ్చిన గడువు పూర్తి అయినా డబ్బులు ఖాతాలో పడకపోవడంతో అతడి ఫోన్ పని చేయకపోవడంతో మోసపోయనని గ్రహించింది. వెంటనే బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పవర్‌ బ్యాంక్‌ యాప్‌‌పై సైబర్ క్రైం కేసు నమోదు చేసినట్లు సీఐ వహీదుద్దీన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed