పీపీఈ కిట్లతోనే ఆ తంతు కానిచ్చిన వధూవరులు

by vinod kumar |   ( Updated:2021-04-27 06:17:33.0  )
పీపీఈ కిట్లతోనే ఆ తంతు కానిచ్చిన వధూవరులు
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుత ఘట్టం.. ప్రతి ఒక్క జంట కు మరువలేని ఒక జ్ఞాపకం. ఎంతో అంగరంగ వైభవంగా తమ పెళ్లి జరుపుకోవాలని అందరు ఆశపడతారు. అలాగే మధ్యప్రదేశ్ కి చెందిన ఒక జంట కూడా తమ పెళ్లి కూడా ఆకాశాన్ని అంటేలా చేసుకోవాలనుకున్నారు. అందుకు తగ్గట్టే అన్ని ఏర్పాటు సిద్ధం చేశారు. అంతలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.

వరుడుకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో పెద్దలు పెళ్లిని క్యాన్సిల్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. కానీ ఆ జంట మాత్రం తమ పెళ్లి అనుకున్న టైమ్ కే జరగాలని పట్టుపట్టారు. కరోనా అయినా సరే మా పెళ్లిని అడ్డుకోలేదు అంటూ వధూవరులు ఇద్దరు పీపీఈ కిట్లతో వివాహ వేదికపై ప్రత్యక్షమయ్యారు. పీపీఈ కిట్లను ధరించి వధువు మెడలో వరుడు తాళిబొట్టు కట్టాడు. అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహ వేడుకకు ముగ్గురు వ్యక్తులు హాజరయ్యారు. వీరందరూ పీపీఈ కిట్లు ధరించారు. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Next Story