- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడికి లవర్ ఫుల్ సపోర్ట్.. నలుగురితో కలిసి ఆ పని చేసిన బాయ్ ఫ్రెండ్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమికులంటే ఎలా ఉంటారు.. పార్కులు, సినిమాలు, షికార్లు అంటూ లోకాన్ని మరిచి చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతారు. సమయం, సందర్భం లేకుండా గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ ఈ లవర్స్ జంట అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. మంచి ఉద్యోగంలో ఉన్న ప్రియురాలు తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంది. ప్రియుడితో కలిసి తాను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేసింది. ఏటీఎంను కొల్లగొట్టి లక్షల డబ్బును ఎత్తికెళ్లింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..
సెప్టెంబర్ 18న అర్ధరాత్రి విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం లూటీ అయింది. ఏటీఎంను ధ్వంసం చేయకుండా దానిలో ఉన్న రూ.16 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో 19న ఉదయం బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. కనీసం ఏటీఎంలో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదు. ఏంటీఎం మిషన్ కూడా ధ్వంసం కాకపోవడంతో పోలీసులకు ఆ కేసు మిస్టరీగా మారింది. అన్నీ తెలిసిన వ్యక్తే ఈ దోపిడీకి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానించారు.
పోలీసులు ఏటీఎంకు వచ్చే రోడ్డు, సమీపంలోని షాపుల సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటిల్లో ఆ రోజు రాత్రి నలుగురు మనుషులు ఉన్న ఓ కారు అదే రూట్లో అనుమానస్పదంగా తిరగడాన్ని గుర్తించారు. వెంటనే ఆ కారు నంబర్ ఆధారంగా దాంట్లో ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్‌కు గురయ్యారు.
యూనియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న మస్మితాకు మంజునాథ్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడితో కలిసే ఏటీఎంలో డబ్బుల చోరీ స్కెచ్ వేసింది. ఏటీఎం పాస్ వర్డ్ తన దగ్గరే ఉండటంతో దానిని ప్రియుడికి ఇచ్చి దాంట్లోని రూ.16 లక్షలను ఎత్తుకెళ్లారు. వారికి ఏటీఎం సెక్యూరిటీ గార్డు కూడా సహకారం అందించాడు. మంజునాథ్‌కు మరో నలుగురు స్నేహితులు సహకరించడంతో రాత్రికి రాత్రే ఏటీఎంను ధ్వంసం చేయకుండా డబ్బులను దోచుకున్నారు.