- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయ ప్రాంగణంలోనే గ్యాంగ్ రేప్.. హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘాతుకం వెలుగుచూసింది. పవిత్రస్థలంగా భావించే ఓ ఆలయ ప్రాంగణంలోనే 50ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ ఆలయ పూజారి, మరో ఇద్దరు అనుచరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వీరి ముగ్గురిపై గ్యాంగ్ రేప్, హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని బదౌన్ పోలీస్ చీఫ్ సంకల్ప్ శర్మ తెలిపారు. ఈ దుర్ఘటన యూపీలోని బదౌన్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
బదౌన్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళ ఎప్పటిలాగే గుడిలో ప్రార్థనకు ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెళ్లింది. కానీ, మళ్లీ వెంటనే తిరిగి ఇల్లు చేరలేదని ఆమె భర్త తెలిపాడు. సుమారు రాత్రి 11.30గంటలకు సొంత కారులో ఆమెను ఇంటికి తీసుకువచ్చి వదిలివెళ్లారని వివరించాడు. ఏం జరిగిందోనని తెలిసేలోపే వెళ్లిపోయారని చెప్పాడు. వారు వెళ్లిన కొద్దిసేపటికే ఆమె ప్రాణాలొదిలిందని అన్నాడు. బదౌన్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశ్‌పాల్ పోస్టుమార్టం రిపోర్టు వివరాలు తెలుపుతూ ఆమె ప్రైవేట్ పార్టులకు గాయాలున్నాయని, దేహంపై అక్కడక్కడ గాట్లు ఉన్నాయని వివరించారు. ఒక కాలు ఫ్రాక్చర్ అయిందని పేర్కొన్నారు. రక్తస్రావం అధికంగా కావడంతో ఆమె చనిపోయిందని తెలిపారు. లైంగికదాడి జరిగినట్టుగా ఈ రిపోర్టు తెలుపుతున్నదని చెప్పారు. కాగా, నిందితుడు మాట్లాడిన వీడియో ఒకటి సోమవారం వెలుగులోకి వచ్చింది. గుడి ఆవరణలోని బావిలో ఆమె పడితే మరో ఇద్దరితో కలిసి కాపాడి తీసుకువచ్చానని నిందితుడు అందులో చెప్పాడు. ఆమె ఇంటికి చేర్చినప్పుడు ఆమె ప్రాణాలతోనే ఉన్నదని బుకాయించారు. తమ ప్రాథమిక విచారణలో స్థానిక పోలీసు స్టేషన్ ఇంచార్జీ అలసత్వం వహించినట్టు తేలిందని పోలీసు అధికారి శర్మ తెలిపారు. అందుకే అతనిపై సస్పెన్షన్ వేటుకు ఆదేశించానని వివరించారు. ఈ ఘటనపై నేషనల్ కమిషన్ ఫర్ విమెన్(ఎన్‌సీడబ్ల్యూ) స్పందించింది. తమ బృందం బదౌన్‌కు పంపామని ఎన్‌సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ తెలిపారు. బాధితులు, పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.