Rain Alert: తెలంగాణకు IMD అధికారుల హెచ్చరిక.. ఈ జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన వర్షాలు

by Kavitha |
Rain Alert:  తెలంగాణకు IMD అధికారుల హెచ్చరిక..  ఈ జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రానికి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ద్రోణి తరహా వాతావరణం ఉందని, దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు లేకపోయినా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే నేడు మహబూబ్‌నగర్, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వంటి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. దీంతో అధికారులు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే పగటిపూట 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. ఉదయం ఎండ కాసినా.. సాయంత్రానికి చల్లబడి వర్షాలు కురుస్తాయని అన్నారు. గాలుల వేగం చూస్తే గంటకు 30-40 కి.మీ వేగంతో కొన్ని చోట్ల బలమైన గాలులు వీస్తాయన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Next Story

Most Viewed