- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. హీరో నాగార్జున డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుధవారం కార్యక్రమం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. నాగచైతన్య సమంత విడాకులు వంద శాతం కేటీఆర్ కారణంగా జరిగాయంటూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చొద్దంటే సమంతను నా దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను కేటీఆర్ వద్దకు వెళ్ళాలని నాగార్జున వాళ్ళు ఒత్తిడి చేశారని. సమంత కేటీఆర్ వద్దకు వెళ్ళనంటూ నిరాకరించిందని, దీంతో తాము చెప్పింది వినకపోతే ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చారంటూ.. మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మా కుటుంబం పట్ల మంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే ఈ వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున తన ట్వీట్‌లో "గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను”. అని రాసుకొచ్చాడు. కాగా హీరో నాగార్జున డిమాండ్ పై మంత్రి కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.
Read More : ఎన్ కన్వెన్షన్ కూల్చొద్దంటే కేటీఆర్ సమంతను పంపాలన్నాడు : Konda Surekha