- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బడ్జెట్ ప్రసంగంలో నెపోటిజంపై నిర్మలా సీతారామన్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కనిపిస్తోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చామని తెలిపారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌తో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశామని అన్నారు. కొత్త విధానాలతో ప్రతి చివరి వ్యక్తికీ కూడా ఫలాలు అందాయని చెప్పారు. పాలనలో పాదర్శకత విధానాలను పాటించామని వెల్లడించారు. నెపోటిజం, కరప్షన్‌కు అంతం పలికామని అభిప్రాయపడ్డారు. ఏ వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం వదిలిపెట్టలేదని అన్నారు.
ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామన్నారు. వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కాబోతున్నాయని చెప్పారు. కరోనా కాలంలో ప్రపంచదేశాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, భారత్ మాత్రం వీటికి అతీతంగా అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. మౌలిక వసతులను రికార్డుస్థాయిలో చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో సామాజిక న్యాయం అనేది రాజకీయ నినాదంగా ఉండేదని.. కానీ, తమ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది మా పనితీరుగా మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. వనరులను సమర్థంగా పంచి బంధుప్రీతిని, అవినీతిని రూపుమాపామని అన్నారు.