- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. సర్వేలన్నీ తమకే అనుకూలం: రాహుల్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్ఆర్ఐలకు మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. అమెరికాలోని న్యూయర్క్ జాకబ్స్జావిట్స్లో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... కాంగ్రెస్అధికారంలోకి రాగానే సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. ఇండస్ట్రీలు, కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రాల వారీగా ప్రణాళికను తయారు చేస్తామన్నారు. తెలంగాణలో ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలమని చెబుతున్నాయన్నారు. ప్రజా నాడిని కూడా తాము పసిగట్టామని పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఆర్ఐలంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజా సంక్షేమం పరుగులుపెట్టాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైస్‌ప్రెసిడెంట్ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.