- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sex & Science : శృంగారం పండాలంటే కావల్సింది దేహాలు కాదు.. ప్రేమ!
శృంగారం (Romance) అంటే రెండు శరీరాల కలయికో లేక కండరాల రాపిడో లేదా పీనో-వెజైనల్(Penile-vaginal) కలయికో కాదు. శృంగారం(Sex) ఒక భావ ప్రకటన! తన భాగస్వామికి స్పర్శ ద్వారా ‘నీకు నేనున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కావాలని’ తెలియజేసి ఒక సున్నితమైన దేహభాష. అందుకే శృంగారానికి రెండు దేహాల అవసరమే కాదు... ప్రేమ, ఆప్యాయత, అనురాగం, భద్రత, బాధ్యత, నమ్మకం... ఈ అనుకూల భావోద్వేగాలు కూడా ఉంటేనే శృంగార సఫలమవుతుంది. తరుచూ దంపతులు శృంగారంలో పాల్గొంటే వారి మధ్య సాన్నిహిత్యం, ప్రేమ విప్పారుతుంది. ఒకరిపై ఒకరికి బాధ్యతా పెరుగుతుంది. అంతేకాదు, శృంగారంలో పాల్గొనే సమయంలో రక్తంలోకి, అనేకమైన శరీరానికి ఉపయోగపడే న్యూరోట్రాన్సిమిటర్స్(Neurotransmitters), హార్మోన్లు(Hormones), ఎండార్ఫిన్స్ (Endorphins)విడుదలై దేహం, మనస్సు రెండూ పూర్తి స్థాయిలో తేలికైపోతాయి. అందుకే కీళ్లనొప్పులు(Arthritis) ఉన్నవాళ్లు శృంగారంలో పాల్గొన్న తర్వాత నొప్పులు తగ్గటం గమనించారు. దానిక్కారణం మానసిక ఒత్తిడి వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల బిగుసుకుపోయే కండరాలు(Tensile muscles), లిగమెంట్స్ని సడలించి, రిలాక్స్ చేసే ఎండార్ఫిన్స్ విడుదల కావడమే. చాలామంది శృంగారం కేవలం పిల్లల కోసమే అనుకుంటారు. శృంగారానికున్న విధి విధానాల్లో పునరుత్పత్తి(Reproduction) విధితో పాటు దంపతుల మధ్య ఉత్తేజాన్ని, ఆనందాన్ని సృష్టించడం దాని ద్వారా వారి మధ్య బంధం మరింత పటిష్టమవడం కూడా ఉన్నాయి. ఏమైనా శృంగారంలో దంపతులు పాల్గొనే శాతం క్రమంగా తగ్గిపోతుందన్నది మాత్రం వాస్తవమే.
దంపతుల మధ్య శృంగారం తగ్గడానికి కారణాలు :
వయస్సు పెరిగే కొద్దీ... యవ్వనవంతుల కంటే సెక్స్‌లో మీరు పాల్గొనే రేటు బాగా తగ్గుతుంది. 19-29 సం॥ల వారు 10-15 సార్లు నెలలో పాల్గొంటారు. 30-40 వయసు వారు 8-12 సార్లు నెలలో పాల్గొంటారు. 40-50 సం॥ల వారు4-8 సార్లు నెలకు పాల్గొంటారు. వైవాహిక జీవిత వయస్సు పెరిగే కొద్దీ శృంగారం తగ్గిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ-టెస్టోస్టీరాన్ హార్మోన్ (Testosterone hormone)శాతం పడిపోవడం కూడా కోరిక తగ్గడానికి కారణం.
- డయాబెటిస్, బీపీ, గుండెజబ్బులు, కిడ్నీవాధ్యులు, థైరాయిడ్ సమస్య లాంటి అనారోగ్యాల వల్ల కూడా సెక్స్‌లో పాల్గొనే నిష్పత్తి తగ్గిపోతుంది.
- ఇంట్లోని పెద్దవారి సెక్స్ వ్యతిరేక ధోరణి కూడా దంపతుల పైన పడుతుంది. సెక్స్‌లో నవీనత కొరవడడం.
- హిస్టెరెక్టమీ, ప్రసవాలు, ఎపిసియోటమీ, సిజేరియన్, బైపాస్ సర్జరీ లాంటి ఆపరేషన్ల తర్వాత శారీరక మానసిక స్థితిగతులు.
- శృంగారంలో పాల్గొంటే గర్భం వచ్చి చదువు, ఉద్యోగం, కెరీర్ పాడవుతాయేమోన్న భయం.
- కుటుంబ నియంత్రణను సహజ పద్ధతుల్లో పాటించడం.
- కాన్పు అయిన తర్వాత పిల్లల పెంపకం, పోషణ, నిద్రలేని రాత్రులు తల్లికి అలసటను కలగచేయడం.
- ఐటి ప్రొఫెషనల్స్-షిఫ్ట్ డ్యూటీల వల్ల తరచూ కలుసుకో లేకపోవడం, రాత్రిళ్లు ఆఫీసుల్లో డ్యూటీ చేసి, తెల్లారి నిద్రపోవడం.
- దంపతుల మధ్య వైరుధ్యాలు, అహాలు, ఆర్థిక సమస్యలు.
- అక్రమ సంబంధాలు
- శ్రమను కలిగించే పనులతో కలిగే అలసట, డిప్రెషన్
- ఇంట్లో అత్తా, ఆడబిడ్డల గృహహింస, భర్త ఆధిపత్యం ధోరణి
- రాత్రి షిఫ్టుల వల్ల పని స్థలాల్లోనే అశ్లీల సైట్స్ చూడడం, అక్కడే స్వయంతృప్తి ద్వారా సెక్స్ కోరిక తీర్చుకోవడం, ఇంటికొచ్చి భార్యని తిరస్కరించడం.
- బాల్యంలో లైంగిక అత్యాచారాలకు లోనవటం.
చికిత్స-పరిష్కారం
ముందు దంపతులు, శృంగార వైఫల్యాలకు మంచి సెక్సాలజిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అలాగే తమ మధ్య ఉన్న వైరుధ్యాలు, గొడవలను పరిష్కరించుకోవటానికి మెరైటల్ థెరపిస్ట్‌ను కలవాలి. డయాబెటిస్ లాంటి వ్యాధులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ యోగా - నడక మంచి పౌష్టికాహారాలతో జీవన సరళిని మార్చుకోవాలి. డయాబెటిస్, బీపీ లాంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా అంగస్తంభన లోపం వస్తుంది. కాబట్టి డోసు, మందు మార్చే విషయంలో మీ డాక్టర్‌ను సంప్రదించాలి. షిప్టు డ్యూటీల్లో దంపతులు ఇద్దరికీ ఒకే రోజు సెలవు, తీరిక వచ్చే విధంగా చూసుకుంటూ వారంలో 2 లేక 3 రోజులు ఖచ్చితంగా శృంగారపు దినాలని పాటించాలి. అలాగే వైవాహిక జీవితకాలం ఎక్కువగా ఉన్న దంపతులు శృంగారంలో నూతన పద్ధతులను, సృజనాత్మకతను పాటించాలి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్