మా ఆయన నెలలో 20 రోజులు బయటే ఉంటారు.. నాకు పిల్లలు కలగడం లేదు! అయితే ఈ 5 పద్ధతులు పాటిస్తే చాలు..!!

by Bhoopathi Nagaiah |
మా ఆయన నెలలో 20 రోజులు బయటే ఉంటారు.. నాకు పిల్లలు కలగడం లేదు! అయితే ఈ 5 పద్ధతులు పాటిస్తే చాలు..!!
X

నా పేరు శ్రావణి. పెళ్లై నాలుగేళ్లు అయింది. నా సమస్యంతా ఇంకా పిల్లలు లేరనే. మా వారు ఉద్యోగరీత్యా నెలలో పదిరోజులు మాత్రమే ఇంటి దగ్గరుంటారు. అయితే పిల్లలు పుట్టక పోవడం గురించి గైనకాలజిస్టు కలిశాం. నాకు స్కాన్ చేసి అమ్మాయి బహీనంగా ఉంది, గర్భాశయం చిన్నదిగా ఉందని మందులు రాశారు. ఇప్పటికి ఆరు నెలలైంది కానీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ప్రతి నెలా మెన్సస్ టైమ్‌లో రమ్మంటే వెళ్తున్నాను. డాక్టర్లు అంతకన్నా ఏం చెప్పట్లేదు. మేమేం చేయాలి? అండం విడుదలయ్యే రోజులు తెలుసుకోవచ్చా? శృంగారం పట్ల అసహ్యం కలుగుతోంది. ఒక్కోసారి కోపం వచ్చి ఎందుకలే ఇన్నేళ్లు లేనిది ఇక రాదనే నిరాశతో ఆయన్ని బాగా ఏడిపిస్తాను. ఇక హాస్పిటల్‌కు వెళ్లాలని లేదు. మాది మేనరికం అయినందువల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? దయచేసి వివరించండి.

శ్రావణీ! ఇంత విసుగైతే ఎలా? ఓపిక ఉండాలి కదా! ఇద్దరిలో సమస్య ఉంది కాబట్టి ఇద్దరూ ఓపికగా మంచి డాక్టర్ను సంప్రదించి అన్ని పరీక్షలు, చికిత్సలు చేయించుకోవాలి. ఒకరికొకరు దూరంగా ఉండడం కూడా ఓ కారణం. రుతుక్రమం క్రమం తప్పకుండా ఉంటే నెలసరి ఆగిన 12వ రోజు నుంచి 16 రోజుల మధ్యన అండం విడుదలవుతుంది. అప్పటి కలయికలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

1. మందులు వాడుతూనే ఉండాలి.

2. కలయికకు మందు, కలయిక జరిగేటప్పుడు భార్య నడుము కింద దిండు పెట్టుకుని కలయిక తర్వాత 20 నిమిషాలు లేవకుండా ఉండాలి.

3. 20 నిమిషాల వరకూ మూత్ర విసర్జన చేయవద్దు. నీటితో శుభ్రం చేసుకోవద్దు.

4. అన్నిటికీ మించి మానసిక ఒత్తిడి పనికిరాదు. దానివలన హార్మోన్స్ విడుదల డిస్టర్బ్ అయ్యి, అండం విడుదల క్రమం తప్పుతుంది.

5. వీలైనంత వరకూ ప్రతిరోజూ పిల్లలకోసమే అనే టార్గెట్‌తో కాకుండా ఇద్దరిమధ్య ప్రేమబంధాలు పెంచుకోవడం కోసమన్నట్లు శృంగారంలో ఆనందంగా, ఇష్టంగా పాల్గొనాలి. లేకపోతే మీరు అన్నట్లు సెక్స్ అంటేనే అసహ్యం పుడుతుంది. ముందు మీరు పాజిటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story