- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భార్యకు గర్భసంచి లూజుగా ఉంది.. ఆమెతో శృంగారం చేయవచ్చా..?
మేడమ్! నాకు పెళ్ళయి 2 సంవత్సరాలవుతోంది. నా భార్యకు మొదటిసారి అబార్షన్ అయ్యింది. ఇప్పుడు తాను గర్భవతి. ఐదోనెల గడుస్తున్నది. తన గర్భసంచి వదులుగా ఉందని డాక్టర్ కుట్లు వేసింది. కాన్పయ్యే దాకా సెక్స్‌లో పాల్గొనవద్దని చెప్పింది. నాకు చాలా కష్టంగా ఉంది. కోరికలు ఆపుకోలేకపోతున్నా. కలిస్తే అబార్షన్ అవుతుందట. బయటకు వెళ్ళలేను. ఏం చేయాలో తోచడం లేదు. పైపైన చెయ్యొచ్చా. నా భార్య ఒప్పుకోవడం లేదు. బయట స్త్రీలతో సెక్స్‌లో పాల్గొనాలని ఉంది. కానీ, పాల్గొంటే ప్రమాదమని తెలుసు. సలహా ఇవ్వండి.
నీ భార్యకు గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ వదులుగా ఉండటం వల్ల కుట్లు వేసే ‘సర్కిలాజ్’ అనే ఆపరేషన్ చేశారు. ఆమెకు పూర్తిగా శారీరకంగా, మానసికంగా రెస్టు అవసరం. సెక్స్‌లో పాల్గొంటే ఆబార్షన్ అవుతుంది. నీ భార్యకు కూడా ప్రమాదం. పైపైన సెక్స్ వల్ల కూడా గర్భసంచి కండరాలు సంకోచానికి గురై బిడ్డకు, తల్లికి ప్రమాదం. అసలే ముందు అబార్షన్ అయ్యి ఇప్పుడు వచ్చిన గర్భం నిలుస్తుందో లేదో అన్న భయం, అభద్రతల్లో ఉన్న నీ భార్యను సెక్స్ కోసం ఎందుకు వేధిస్తావు? నీ నుంచి ఆమె తన గర్భాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నిరంతరం అభద్రతకు, భయానికి గురి అవ్వాలా? ఆమెకు రక్షణ, మంచి ఆహారం, వైద్యం, మానసిక శాంతి ఇచ్చే బదులు నువ్వే సతాయిస్తే ఎలా? ‘అసలు బయటకు వెళ్ళలేను. బయట స్త్రీలతో సెక్స్‌లో పాల్గొంటే ప్రమాదమని తెలుసు’ లాంటి నీచమైన మాటలు ఎలా వస్తాయి. మీ మగవాళ్ల నోట్లోంచి? ఇంట్లో భార్య తాత్కాలికంగా శృంగారానికి పనికిరాని మనోశారీరక స్థితిలో ఉంటే ఆమెను మరింత బాగా శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాల్సిన సహజీవనపు కనీస సూత్రాన్ని మరిచి ‘బయటి స్త్రీలతో వెళ్లొచ్చో లేదో’ అన్న చెత్త మీమాంసలో పడతారు. విలువలు మార్చిపోయి ఆ సంబంధాల్లోకి సిగ్గు, భయం లేకుండా వెళ్లిపోతారు.
భర్తకి ఏదైనా రోగం, యాక్సిడెంట్ లేదా అంగస్తంభన సమస్యో, శీఘ్రస్కలన సమస్యో వస్తే ఏ ఆడదీ భర్తనుండి శృంగార సుఖం దొరకడం లేదని, ‘అయ్యో నా మొగుడిట్లా పనికి రాకుండా అయిపోయె, నేనింకో మగాడి దగ్గరికి పోలేను కదా’ అని ఆలోచించదు. 20 ఏళ్ల నా సెక్సాలజీ ప్రాక్టీసులో ఏ స్త్రీ అడగలేదు ఇలా. ‘నా భర్త ఆర్యోగం బాగు చేసుకోవడానికి నేనేం చేయాలి. ఎలాంటి మందులు వాడాలి? ఆయనకి నేనెట్టా సహకరించాలో చెప్పండి డాక్టర్. ఆయన కోసం నేనేమన్నా చేస్తాను’ అని అడిగిన స్త్రీలే 99.9 శాతం. మీ భర్తలకి మానసిక స్థైర్యాన్ని, భద్రతను, తోడునీ ఇవ్వడమే కాదు.. పూజలు ఉపవాసాలూ చేస్తారు. ఆ అమాయకపు హృదయాల నిండా ప్రేమ తప్ప కల్మషం లేని భార్యలు వాళ్లు.
మీరు మాత్రం భార్య అనారోగ్యంగా ఉంటే మానసికంగా ఆమెను సాధిస్తూ బయట స్త్రీల దగ్గర మీ తుచ్ఛమైన లైంగిక వాంఛలు తీర్చుకొనే ప్రణాళికలు వేస్తుంటారు. వెళ్లిచూడు, సుఖరోగాలు, ఎయిడ్స్ రోగస్థులై నీ భార్యకు కూడా ఎయిడ్స్ అంటిస్తావు. నువ్వు మరణించే వరకూ చస్తూ బతుకుతావు. మీ మరణం తర్వాత అనాథలైన నీ పిల్లలు అమ్మా నాన్నా లేని, దయలేని లోకంలో బతుకుతారు. ఇదీ నువ్వు నీ కుటుంబానికిచ్చే కానుక. నువ్వు పైపైన సెక్స్ చేయొద్దు. నీ భార్యని వేధించవద్దు. బయట స్త్రీల దగ్గరికి వెళ్లవద్దు. కాన్పు అయ్యే దాకా నిబ్బరంగా ఉండు. మంచి ఆహారం, ప్రేమ, భద్రత ఇస్తూ నీ భార్య ప్రసవం ఆరోగ్యకరంగా అయ్యేటట్లు చూడు. నువ్వేనా, నీ భార్య కూడా గర్భావస్థ సమయంలో సెక్స్‌కు దూరంగా ఉండటం లేదూ? స్త్రీకి గర్భం రావడానికి కారణం భర్త కూడా? గర్భం, ప్రసవం, ప్రసవానంతర మాతా శిశు సంరక్షణలో భర్త కూడా అంతే బాధ్యతగా, నిజాయితీగా ఉండాలి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్