ఓటీటీలోకి రాబోతున్న ‘బఘీర’.. హిందీ వెర్షన్ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

by Hamsa |   ( Updated:2024-12-23 05:03:06.0  )
ఓటీటీలోకి రాబోతున్న ‘బఘీర’.. హిందీ వెర్షన్ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: ‘ఉగ్రమ్’ సినిమాతో శాండల్‌వుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్న రోరింగ్ స్టార్ శ్రీ మురళి(Sri Murali) యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘బఘీర’(Bagheera). అయితే ఈ మూవీకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashant Neel) కథ అందించగా.. డాక్టర్ సూరి(Dr. Suri) తెరకెక్కించారు. దీనిని భారీ బడ్జెట్ చిత్రాలు సలార్(Salar), కేజీఎఫ్ నిర్మించిన హోంబలే ఫిలీంస్(Hombale Films) బ్యానర్‌పై విజయ్ కిరగందైర్(Vijay Kiragandair) నిర్మించారు. బఘీర చిత్రం అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్‌కు దక్కించుకుంది.

ఇక నవంబర్ 21న నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో టాప్ 2 స్థానంలో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, హీందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. బఘీర సినిమా డిసెంబర్ 25 నుంచి డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌(Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్(Streaming) అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed