వారిని కడియం శ్రీహరి ఎన్‌కౌంటర్ చేయించారు.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
వారిని కడియం శ్రీహరి ఎన్‌కౌంటర్ చేయించారు.. తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. మంగళవారం రాజయ్య మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరికి ఆయన కూతురు కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హవాలా రూపంలో విదేశాలకు డబ్బులు తరలించారని ఆరోపించారు. తన మాట వినని వారిని కడియం నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్ చేయించాలని కీలక ఆరోపణలు చేశారు. డీఈవోల బదిలీల్లో రూ.2 కోట్లు తీసుకున్నారని వెల్లడించారు. తన కూతురికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్‌లో ఉంటానని.. లేకపోతే కాంగ్రెస్‌లో చేరుతానని బ్లాక్‌మెయిల్ చేశాడని అన్నారు. చివరికి తన కూతురికే టికెట్ ఇప్పించుకొని పార్టీని నిండా ముంచి స్వార్థప్రయోజనాల కోసం పార్టీ మారాడని సీరియస్ అయ్యారు. అంతేకాదు.. అసలు కడియం శ్రీహరి కులవారసత్వంపై కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు.

Advertisement

Next Story