- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు బీఆర్ఎస్, బీఎస్పీ అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు ప్రకటించారు. మంగళవారం ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. లౌకికవాదాన్ని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఈవెంట్ మెనేజ్‌మెంట్‌లా ఉందని విమర్శించారు.
కొన్ని వర్గాల హక్కుల కోసం పొత్తులు తప్పవని అభిప్రాయపడ్డారు. తమకు ప్రజల మద్దతు ఉన్నంతవరకు పొత్తు కొనసాగుతుందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి పోటీ చేసే చాన్స్ ఉందని చెప్పారు. గతంలో కేసీఆర్‌పై చేసిన విమర్శలు వ్యక్తిగతం కాదని అన్నారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలుగానే చూడాలని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం అని వెల్లడించారు.