- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: పాతబస్తీ పరిస్థితిపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్‌లోని పాతబస్తీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తమ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చేందుకు సిద్ధమైందని కీలక ఆరోపణలు చేశారు. పాతబస్తీలో కనీస సౌకర్యాలు కూడా లేవు. గతంలో చిన్న వర్షానికే నీట మునుగుతోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వీటిని పరిష్కరించడం లేదు. పవర్ కట్ కారణంగా రోజూ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పరిస్థితి మారలేదు. అందుకే ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. హైదరాబాద్‌తో పాటు పాతబస్తీని అభివృద్ధి చేసే బాధ్యత తమది అన్నారు.
కాంగ్రెస్‌తో సమస్యలు పెరుగుతాయి తప్పా.. పరిష్కారం రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మిడిల్ క్లాస్ ప్రజలను అవమానించేలా మాట్లాడేవారని గుర్తుచేశారు. ఈసారి మేనిఫెస్టోలో మిడిల్ క్లాస్ ప్రజలకు కావాల్సిన ఎలాంటి అంశం లేదని విమర్శించారు. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తిని వారసులకు దక్కకుండా చేస్తోన్న కాంగ్రెస్ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇండియా కూటమితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ యువరాజుకు ఒక ఫిలాసఫర్ ట్యూషన్ చెప్పి కొన్ని ఐడియాలు ఇస్తున్నాడు. అందుకే హైదరాబాద్‌లో కాంగ్రెస్ స్ట్రాంగ్ క్యాండిడేట్‌ను పెట్టలేదని ఎద్దేవా చేశారు.