- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కాంగ్రెస్‌కు 13, బీజేపీకి 3, ఎమ్ఐఎమ్‌కు 1, బీఆర్ఎస్‌కు 0’
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు 13 సీట్లు, బీజేపీకి 3 సీట్లు, ఎమ్ఐఎమ్‌కు 1, బీఆర్ఎస్‌కు సున్నా అని కుండబద్దలు కొట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ కనిపించదు అని అన్నారు. తెలంగాణను పదేళ్ల పాటు కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. రైతులు, విద్యార్థులను, యువతను, మహిళలను అందరినీ కన్నీరు పెట్టించారని గుర్తుచేశారు. అకాల వర్షం కారణంగా తడిసిన ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. MSP ధరకు కొనుగోలు చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ప్రధాని మోడీ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు ప్రధానిగా ఉండి ఆయన తెలంగాణకు ఇచ్చిన గుండు సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే అని ధీమా వ్యక్తం చేశారు. 400 సీట్లు సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నది రాజ్యాంగాన్ని మార్చేందుకే అని అన్నారు. అందుకే బీజేపీకి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలని కోరారు.