- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఒవైసీ సోదరులు ఉండే ఏరియాల్లో హిందువులను ఖాళీ చేయించారు’
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఒవైసీ సోదరులు నివాసం ఉంటే ఏరియాల్లో హిందూ కుటుంబాలను ఖాళీ చేయించారని కీలక ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ మూడు పార్టీలు ఒక్కటే అని అన్నారు. గతంలో బీఆర్ఎస్ అడుగులకు ఎమ్ఐఎమ్ మడుగులు ఒత్తింది.. ఇప్పుడు కాంగ్రెస్ పక్కన చేరిందని విమర్శించారు. ఎమ్ఐఎమ్‌కు రెండు అజెండాలు ఉంటాయని అన్నారు. చీకటి వ్యాపారం, బీజేపీని ఓడించడం ఈ రెండే ఎమ్ఐఎమ్ లక్ష్యమని తెలిపారు.
ఈ మూడు హిందూ వ్యతిరేక పార్టీలే అన్నారు. వాటి డీఎన్ఏ ఒక్కటే కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు ఒవైసీ సోదరులు ఇద్దరూ రాహుల్ గాంధీని తిట్టారు.. ఇప్పుడు అవసరానికి కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని సీరియస్ అయ్యారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి, మతకల్లోలాలే ఉంటాయన్నారు. దేశానికి సుస్థిరమైన పాలన అందించడానికి నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ లోక్ సభ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. దేశంలోని 140 కోట్ల ప్రజల మద్దతుతో గెలిచేది ప్రధాని నరేంద్ర మోడీనేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.