- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘జితేందర్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్నా.. ఇప్పుడు పార్లమెంట్ సీటు నాదే’
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నేతలాగే మాట్లాడుతున్నాడని బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పాలనలో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌నే ఫాలో అవుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గొప్పగా ప్రటించిన ఆరు గ్యారంటీలు పేపర్లకే పరిమితం అయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం కూల్చివేత వార్తలపై ప్రస్తుతం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు. దీనికి ఆజ్యం పోసేలా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ ఫైట్ నడుస్తోందని తెలిపారు. జితేందర్ రెడ్డి కోసం అసెంబ్లీ సీటు వదిలేశానని గుర్తుచేశారు.
మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని తానే అని.. రెండో జాబితాలో తనపేరే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదని అన్నారు. పదేళ్ల తర్వాత బీఆర్ఎస్‌కు ప్రజలు సరైన విధంగా బుద్ధి చెప్పారని.. ఇప్పుడు రెండు నెలల కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రంలో తాము మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. కేంద్రంలోనూ మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు.