జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారు

by GSrikanth |
జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించునేందుకు గానూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 29న ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజిగిరి తదితర మూడు పార్లమెంట్ స్థానాల్లో ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. సోమవారం ఉదయం 9 గంటలకు ఐటీసీ కాకతీయ హోటల్‌కు నడ్డా చేరుకుంటారు. 11.15 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి బయల్దేరి, మధ్యాహ్నాం 12.15గంటలకు కొత్తగూడెం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు ఖమ్మం పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు. అక్కడే ఆయన లంచ్ ముగించుకొని, మధ్యాహ్నం 2.20 గంటలకు హెలికాప్టర్ ద్వారా 2.40 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడి నుంచి హైదరాబాద్ సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉప్పల్‌లో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు.

Advertisement

Next Story