2024లోనే కాదు.. 2029లో కూడా మోడీనే పీఎం: MP అర్వింద్

by GSrikanth |
2024లోనే కాదు.. 2029లో కూడా మోడీనే పీఎం: MP అర్వింద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికి ప్రధానిగా మోడీ తప్ప.. మరో ప్రత్యామ్నాయం లేదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అర్వింద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 2024తో పాటు 2029లో కూడా మోడీ ప్రధాని అవుతారని ఆయన ఆకాంక్షించారు.

పార్టీకి బలం బూత్ స్థాయి కార్యకర్తలేనని ఆయన కొనియాడారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం డజను సీట్లు గెలిపించాలని అర్వింద్ కోరారు. తన మెడలో ఉన్న పసుపు రంగు జెండా వల్ల పసుపు బోర్డు సాధ్యమైందని, మోడీ వల్ల పసుపు రేటు భారీగా పెరిగిందని వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కాశీ, అయోధ్య బాగుపడ్డాయని, మథుర బాకీ ఉందని, ఈసారి అధికారంలోకి వచ్చాక దాన్ని కూడా బాగు చేస్తామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story