- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తా.. మాజీ క్రికెటర్ ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నాలుగో విడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్ నమోదైంది. ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 51.87 శాతం, అత్యల్పంగా జమ్మూకాశ్మీర్‌లో 23.57 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థిగా బహరంపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు పఠాన్ పలు బూత్‌లకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, యువకులు ఉత్సాహంగా ఓటు వేయడం చూస్తుంటే ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కోసం త్యాగం చేయాల్సి వస్తే అందుకు తాను సిద్ధమని పోలింగ్ వేళ కీలక ప్రకటన చేశారు. తాను ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు వచ్చానని తెలిపారు. దోచుకోవడానికి, దాచుకోవడానికి వేరే రంగాలు అనేకం ఉన్నాయని.. ఆ ఆశే ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని అన్నారు.