- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీకి ఫుడ్ పాయిజన్.. వయనాడ్ పర్యటన రద్దు
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫుడ్ పాయిజన్ అయింది. ఈ విషయాన్ని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కన్వినర్ ఏపీ అనిల్ కుమార్ సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్‌కు ఫుడ్ పాయిజన్ అయిందని, దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఈ కారణంగానే రాంచీలో ఆదివారం నిర్వహించిన ఇండియా కూటమి ర్యాలీకి హాజరుకాలేదని వెల్లడించారు. మరోవైపు, షెడ్యూల్ ప్రకారం మంగళవారం వయనాడ్‌లో రాహుల్ ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించాల్సి ఉండగా, ఆ పర్యటననూ రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇవేకాకుండా, సోమవారం సైతం కేరళలో పర్యటించాల్సి ఉండగా అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీలు మంగళ, బుధవారాల్లో కేరళలో ప్రచారం చేస్తారని అనిల్ కుమార్ తెలిపారు. కాగా, రాష్ట్రంలోని వయనాడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ స్థానానికి ఈ నెల 26న పోలింగ్ జరగనుంది.