- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ మరో జాబితా.. ఇప్పటివరకు ఎంతమందిని ప్రకటించిందంటే..
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మరో ఏడుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం ప్రకటించింది. ఇందులో బిహార్ నుంచి ఐదుగురు, పంజాబ్ నుంచి ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ వీరిని ఎంపిక చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన, సోనియా గాంధీ, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ వంటి నేతలు హాజరైన సమావేశం అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. తాజా జాబితాతో కలిపి కాంగ్రెస్ ఇప్పటివరకు 285 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేస్తుండగా, 40 స్థానాలున్న బిహార్‌లో ప్రతిపక్ష ఆర్జేడీతో కలిసి మహాగట్‌బంధన్ కూటమిగా ఏర్పడిన హస్తం పార్టీ.. 9నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతున్నది.
కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన బిహార్ అభ్యర్థులు వీరే..
* మదన్ మనోహర్ తివారీ - పశ్చిమ చంపారన్
* అజయ్ నిషద్- ముజఫర్‌పూర్
* ఆకాశ్ ప్రసాద్ సింగ్ - మహారాజ్‌గంజ్
* సన్ని హజారీ - సమస్తిపూర్(ఎస్సీ)
* మనోజ్ కుమార్ - శాసారాం(ఎస్సీ)
పంజాబ్ అభ్యర్థులు
* యామిని గోమర్ - హోషియార్‌పూర్ (ఎస్సీ)
* అమర్జిత్ కౌర్ సహోక్ - ఫరీద్‌కోట్ (ఎస్సీ)