- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పార్టీకి నేను ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కావాలని ఎవరో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు సీరియస్ అయ్యారు. శుక్రవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లు రాశారని మండిపడ్డారు. ఎవరినీ వదలిపెట్టబోనని.. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరి భూములు తీసుకోలేదని, అక్రమంగా డబ్బులు సంపాదించలేదని అన్నారు. నాపై తప్పుడు ప్రచారం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
మతతత్వ పార్టీకి తాను ఎప్పుడూ మద్దతు తెలుపలేదని అన్నారు. కేసీఆర్ పరేషాన్‌లో ఉన్నారు.. ఆ ఆగంలోనే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 12కు పైగా సీట్లు వస్తాయని అన్నారు. ఎన్నికల ముగిసినాక బీఆర్ఎస్ కనిపించడం కష్టమే అన్నారు. ఈ ఎన్నికలు కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండనున్నాయని చెప్పారు.