ఈ అవకాశం చేజార్చుకోవద్దు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
ఈ అవకాశం చేజార్చుకోవద్దు.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మక్తల్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ అవకాశం చేజారిపోతే.. ఈ జిల్లా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు అని అన్నారు. డీకే అరుణ ఓడిపోతే పాలమూరు జిల్లాకు వచ్చే నష్టం ఏమీ ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉండి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. బీజేపీని గెలిపిస్తే మత విద్వేశాలను ప్రొత్సాహించినట్లే అని అన్నారు.

తెలంగాణకు రావాల్సిన కంపెనీలు, ఉత్తరప్రదేశ్‌కు, గుజరాత్‌కు తరలించుకుపోవడం ఏనాడైనా చూశామా? అని అడిగారు. నిత్యం మతకలహాలు ఉండటం వల్లే యూపీకి కంపెనీలు రావడం లేదని అన్నారు. అందుకే తెలంగాణ వచ్చిన సంస్థలను తరలించుకుపోతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభావం ఏమాత్రం లేని గుర్‌గ్రామ్‌కు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఓటు వేస్తే ఇక్కడికి వచ్చే పెట్టబడులు కూడా ఆగిపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రంలో అయినా మత కలహాలు ఉంటే పరిశ్రమలు రావు.. ఉపాధి అవకాశాలు పెరగవు అన్నారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ అగ్రనేతలు 400 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్నారని అన్నారు.

Advertisement

Next Story