రాజ్యాంగాన్ని కాపాడుదాం.. అంబేద్కర్ ఆశయాలు రక్షిద్దాం: CM రేవంత్ పిలుపు

by GSrikanth |
రాజ్యాంగాన్ని కాపాడుదాం.. అంబేద్కర్ ఆశయాలు రక్షిద్దాం: CM రేవంత్ పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఆశయాలు రక్షించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన శనివారం ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కదం తొక్కాలన్నారు. బీజేపీ థర్డ్ టైమ్ వస్తే, రాజ్యంగాన్ని చింపేస్తారన్నారు. అందుకే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని, ప్రజలంగా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. స్వతంత్ర్యం ఏర్పడినప్పటికీ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వలనే ఎదిగారన్నారు. ఇంకా ఆయా వర్గాలు డెవలప్ కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story