- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై స్పందించిన CM రేవంత్.. బీజేపీ అధిష్టానం ఎదుట కీలక డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం రాత్రి ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ మెజార్టీ స్థానాల్లో గెలిస్తే మతకల్లోలాలు వస్తాయని అన్నారు. నవనీత్ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇతర మతాలను బీజేపీ కించపరచడంతో పాటు దాడులకు పురిగొల్పుతోందని మండిపడ్డారు. ఎన్నికల వేళ తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించి తెలంగాణకు రావాల్సిన పెట్టుబడిదారులను గుజరాత్‌కు తరలించుకుపోవాలని చూస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన బుల్లెట్ ట్రైన్‌ను కూడా గుజరాత్‌కు తరలించుకుపోయారని అన్నారు. కాగా, అంతకుముందు నవనీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘పోలీసులు పక్కకు తప్పుకుంటే అక్టరుద్దీన్ ఏం చేయగలరు. ఎంఐఎం నేతలకు 15 నిమిషాలు అవసరమైతే.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలు. తాము తలుచుకుంటే ఎక్కడికి పోతారో తెలియదు’ అంటూ అక్టరుద్దీన్ ఓవైసీకి నవనీత్ కౌర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు.