పార్లమెంట్ ఎన్నికల్లో BRS-BSP పొత్తు ఖరారు.. అధికారిక ప్రకటన

by GSrikanth |
పార్లమెంట్ ఎన్నికల్లో BRS-BSP పొత్తు ఖరారు.. అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, బీఎస్పీ ఒక్కటయ్యారు. ఈ మేరకు పొత్తుపై ఇవాళ ఇరు పార్టీల అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సమావేశం అనంతరం కలిసే పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, మంగళశారం మాజీ సీఎం కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా క‌లిశారు.

బంజారహిల్స్‌లోని నంది నగర్ నివాసంలో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. పొత్తుపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. ఇందుకు సంబంచిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని తెలిపారు. అంతేకాదు.. కాసేపట్లో ఇరువురు మీడియా ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ స‌మావేశంలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందంతో పాటు హ‌రీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు ప‌లువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story