- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లను ఓదార్చిన కావ్య మారన్(వీడియో)
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో సంచలన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌లో మాత్రం సత్తాచాటలేకపోయింది. కోల్‌కతా చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టింది. ఫైనల్‌లో ఓటమితో ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
"You've made us proud." 🧡
— SunRisers Hyderabad (@SunRisers) May 27, 2024
- Kaviya Maran pic.twitter.com/zMZraivXEE
మ్యాచ్ అనంతరం ఆమె డ్రెస్సింగ్ రూంకు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ఆ వీడియోను ఎస్‌ఆర్‌హెచ్ సోమవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. కావ్య మారన్ మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో జట్టు టీ20 క్రికెట్ ఆడే విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. ‘మీరందరూ మమల్ని గర్వపడేలా చేశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాం. గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచినా.. మీ వల్లే అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. కోల్‌కతా చాంపియన్‌గా నిలిచినప్పటికీ అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. మనం ఆడిన క్రికెట్ శైలి గురించి చర్చించుకుంటున్నారు.’ అని చెప్పారు.