- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్సీబీతోనే ముగించాలనుకున్నా.. లక్నోలోకి వెళ్లడానికి కారణమదే : కేఎల్ రాహుల్
దిశ, స్పోర్ట్స్ : ఒక సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతోనే ఐపీఎల్ ముగించాలనుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. తాజాగా రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో రాహుల్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ఆర్సీబీతో ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు కోహ్లీ అక్కడే ఉన్నాడు. ‘ఆర్సీబీ తరపున ఆడాలనుకుంటున్నావా?’ అని అతను అడిగాడు. ’జోక్ చేస్తున్నావా?. అది నా కల’ అని నేను బదులిచ్చా. ‘జోక్ చేశా. నీకు ఇది ఆప్షన్ కాదు. ముందు కాంట్రాక్ట్‌పై సంతకం పెట్టు. ఈ ప్రయాణం నీకు క్రేజీగా ఉంటుంది. రెండు నెలలు చాలా ఎంజాయ్ చేస్తావు’ అని విరాట్ చెప్పాడు. 7-8 రంజీ ట్రోఫీ సీజన్లలో నేర్చుకునే విషయాలను ఆ రెండు నెలల్లో నేర్చుకున్నా.’ అని తెలిపాడు.‘బెంగళూరుకు ఆడటం నాకు ఇష్టమే. అక్కడే మొదలుపెట్టాను. అక్కడే ముగించాలనే ఆలోచన కూడా ఉండేది. కానీ, ఐపీఎల్‌లో వేర్వేరు జట్లలోకి వెళ్లే వీలు ఉంది. లక్నో జట్టులోకి వెళ్లడంతో సొంత జట్టును, సొంత సంస్కృతిని ప్రారంభించే అవకాశం నాకు వచ్చింది. లక్నోతోనే ముగిస్తానేమో.’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.
కాగా, రాముల్ 2013లో ఆర్సీబీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.